ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 27: అమ్మవారి దయ వల్ల ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ,బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఉప్పల్ మహంకాళి అమ్మవారి టెంపుల్ , ఈదమ్మ గుడి ధర్మకర్త నర్సింగ్ రావు ఆహ్వానం మేరకు ఈదమ్మ బోనాల పండుగ వేడుకల్లో బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ధర్మకర్త మహంకాళి నర్సింహా ముదిరాజు. గుమిడేల్లి నర్సింగ్ రావు, ఉప్పల్ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు ఆకుల మహేందర్, అన్య బాలకృష్ణ, బాషపల్లీ నిరంజన్ చారి, ఏమాండ్ల రామ్ రెడ్డి, మస్తాన్ భాయ్, శ్రీనివాస్ చారి, కడిగే శేఖర్ రావుల నవీన్ గౌడ్, బాబు సతీష్ చారి, సల్ల రాజీ రెడ్డి, నాగేందర్ రెడ్డి కెసిఆర్ మేడిపల్లి నవీన్ చారి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




