ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 15: ఉప్పల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయటం ఖాయమని, తద్వారా నియోజకవర్గంలో ప్రతి సమస్యను కూలం కుశంగా తెలుసుకొనిపరిష్కరిస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారంతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీర్ పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ అధ్వర్యంలో లక్ష్మారెడ్డి తిరుమల నగర్ నుండి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజలువీర తిలకం దిద్ది మంగళ హారతులు పడుతూ బండారు లక్ష్మారెడ్డి కి ఘన స్వాగతం పలికారు.ప్రచార పాద యాత్రలో భాగంగా లక్ష్మారెడ్డి ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ మేనిఫెస్టో గురించి స్పష్టంగా వివరిస్తూ కాలనీలలో సమస్యలనీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూబిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమనీ, తద్వారా ప్రతి సమస్యను కూలం కుశంగా చర్చించి సమస్యనుపరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లాండ్రీ షాప్ లో ఇస్త్రీ చేస్తూ, కుట్టు మిషన్ షాప్ లో బట్టలు కుడుతు, మటన్ షాపులో మటన్ కొడుతు, కూరగాయల షాపులలో కూరగాయలు అమ్ముతు, చాయ్ పెడుతు, ఆటో నడుపుతు, దోశలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేసీ
మీర్ పేట్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.వినూత్నంగా ప్రచారం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ బిఆర్ఎస్ సైన్యంతో పాదయాత్రగా సాగుతున్న బండారి లక్ష్మారెడ్డి కి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. వీర తిలకం దిద్ది మంగళ హారతులు పడుతూ ఘనంగా స్వాగతం పలికారు. పేద ప్రజల కష్టాలు తీర్చే ప్రజా సేవకుడు బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గానికి ఎమ్మేల్యే గా ఉండాలని కోరుకుంటూ భారీగా మద్దతు తెలిపారు. బిఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు బండారి లక్ష్మారెడ్డికిశ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం మద్దత బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే తమ సామాజిక వర్గానికి మంచి జరుగుతుందనీ మంగాపురం కాలనీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం స్పష్టం చేసింది.బుధవారం మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ మంగాపురం కాలనీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం బిఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి నిత్యం పేద ప్రజలకు అండగా ఉంటూ
ప్రజల పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకుడు బండారి లక్ష్మారెడ్డి ఆన్నరు. ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.ఈ నేథ్యంలోనే తమ విశ్వకర్మ టెంపుల్, సంఘం కార్యాలయ నిర్మాణానికి కొంత స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాల్సిందిగా బండారి లక్ష్మారెడ్డి ని కోరారు. లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన వారందరికీ బీసీబందు లక్ష రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తానని, సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.




