ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రివ ర్యులు తన్నీరు హరీష్ నివాసంలో, బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన 30మంది కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి బిఆర్ఎస్ పార్టీ గులాబి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి ని అధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షలు ముష్యం శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా వైస్ ప్రసిడెంట్ కల్పన రెడ్డి, ఓంకార్ సింగ్, వి.రాధాక్రిష్ణ, డా.ఉదయ్, ఏ.వెంకట్ రెడ్డి, ముజాఫర్, భాను ప్రసన్న గౌడ్, మహేష్, అనిల్ గౌడ్, కే.శివ కుమార్, టి.హన్మంతరావు, రాజశేఖర్ రెడ్డి, సురేష్, చంద్ర శేఖర్, రాము యాదవ్ తదతరులు పాల్గొన్నారు.
ఉప్పల్లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ వైద్య, ఆరోగ్య మంత్రి హరీష్ రావు





