ఉపన్యాసాలతో ఊదరగొట్టడం అలవాటే…

  • హావిలు ఇవ్వడం…మరచిపోవడం పరిపాటే
  • కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌
  • ‌కేసీఆర్‌తోనే గిరిజనులకు న్యాయం సాధ్యమన్న మంత్రి
  • బీఆర్‌ఎస్‌లో చేరిన దేవరకొండ నేతలు  

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ఎన్నికలు వొచ్చినప్పుడల్లా ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్‌ ‌పార్టీకి అలవాటేనని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. హావి•లు ఇవ్వడం అమలు చేయకపోవడం కూడా ఆ పార్టీకి అలవాటేనని అన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బిల్యా నాయక్‌, ఆయన అనుచరులు బీఆర్‌ఎస్‌ ‌తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌.. ‌బిల్యా నాయక్‌, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ…కేసీఆర్‌తో మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతదని చెప్పి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని బిల్యా నాయక్‌ ‌చెప్పారని కేటీఆర్‌ ‌తెలిపారు. ఇవాళ వాస్తవం ఏందంటే..దశాబ్దాలు కొట్లాడితే పరిష్కారం కాని సమస్యలు మేం అడగక ముందే పరిష్కారం చేశారని బిల్యా నాయక్‌ అన్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ ‌తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని, 30 వేల మంది గిరిజన బిడ్డలు..వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్‌ల వరకు ప్రజాప్రతినిధులుగా ఎదిగారని, ఇది తమకు ఒక కానుక అని బిల్యా నాయక్‌ ‌తెలిపినట్లు కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఫ్లోరోసిస్‌ను రూపుమాపిన నాయకుడు కేసీఆర్‌ ‌మాత్రమే అని చెప్పారు. అన్నింటికి మించి గిరిజన జాతికి రిజర్వేషన్లు కల్పించారని, తమ తండాలకు త్రీ ఫేజ్‌ ‌కరెంట్‌ ‌వొస్తుందని బిల్యా చెప్పారన్నారు. విద్యా, ఉద్యోగాల్లో 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన మొనగాడు కేసీఆర్‌ అని ఆయన చెప్పారని, ఇన్ని కారణాల వల్ల బీఆర్‌ఎస్‌లోకి వొస్తున్నానన్నారని కెటిఆర్‌ అన్నారు. రాజకీయంగా కూడా చూసుకోవాలని, కాకపోతే ఇన్ని కారణాలు ఉన్నాయని బిల్యా నాయక్‌ ‌చెప్పారని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. రవీంద్ర నాయక్‌, ‌బిల్యా నాయక్‌ ‌మంచి మిత్రులమని చెప్పారని కేటీఆర్‌ ‌తెలిపారు. ఎలక్షన్లప్పుడే తిట్టుకుంటాం…తర్వాత మంచిగానే ఉంటామని చెప్పారన్నారు. భవిష్యత్‌లో కూడా కలిసే ఉంటాంమని, ఇద్దరు నాయకులు కలిసిన తర్వాత..దేవరకొండ నియోజకవర్గంలో 60 వేల మెజార్టీ రావాలని కేటీఆర్‌ ‌సూచించారు.

గత 15 రోజుల నుంచి 32 నియోజకవర్గాలకు వరకు తిరిగానని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. ఆదిలాబాద్‌ ‌నుంచి వనపర్తి దాకా, సత్తుపల్లి నుంచి మెదక్‌ ‌వరకు.. తెలంగాణలోని నాలుగు మూలలా తాను తిరిగానని, ప్రజల మూడ్‌ ‌స్పష్టంగా కనబడుతుందని, ప్రజల నుంచి అసహనం వ్యక్తం కావడం లేదని, ప్రభుత్వం వి•ద వ్యతిరేకత కనబడకపోగా, కేసీఆర్‌ ‌తిరిగి ముఖ్యమంత్రి అయితేనే పేదలు, రైతులు, బడుగు, బలహీన వర్గాలు బాగుంటారని ప్రజలు విశ్వసిస్తున్నారని కేటీఆర్‌ ‌తెలిపారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ ‌పార్టీ వాళ్లు.. కొత్త అంగిలాగు కుట్టించుకుంటారని, ఇండ్లకు సున్నాలు వేసుకుంటారని కేటీఆర్‌ ‌విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ పడుతారని ఎద్దేవా చేశారు.

ఇక విడియాలో కూడా సర్వే వొస్తది.. అంతా అయిపోయిందంటారంటారని, గమ్మతైన డైలాగులు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తారని, 2018లో అప్పటి పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి. కేసీఆర్‌ను ఓడించే దాకా గడ్డమే తీయనని స్టేట్‌మెంట్‌ ఇచ్చారని, మరి ఉత్తమన్న గడ్డం ఉందో పీకిందో తెలియదు గానీ, ఇలాంటి డైలాగులు మస్తుగా విన్నామని కెటిఆర్‌ ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న రేవంత్‌ ‌రెడ్డి కూడా అలాంటి డైలాగులు కొట్టిండని, కొడంగల్‌లో తనను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్టేట్‌మెంట్‌ ఇచ్చిండనిచ, ఆ సన్నాసి మళ్లా పోటీ చేస్తుండని, అది వేరే విషయం కానీ.. ఇలా బేకార్‌ ‌డైలాగులు కొడుతారని అని విమర్శించారు. ఐదారేండ్ల కింద వోటుకు నోటు..ఇప్పుడేమో సీటుకు నోటు..అందుకే రేవంత్‌ ‌రెడ్డిని ఇప్పుడు రేటెంత…రేటెంత అని అంటున్నారని విమర్శించారు. వాళ్లతోటి అయ్యేదే లేదని కేటీఆర్‌ ‌నిప్పులు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *