- ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
- తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మెన్ ప్రొఫెసర్ తుమ్మ పాపిరెడ్డి
(నిన్నటి తరువాయి…)
మీకు కేసీయార్‌తో పరిచయంఎలా మొదలైంది?
పాపిరెడ్డి : చంద్రబాబు హాయాంలో వ్యవసాయ కరెంటు బిల్లుల భారం మోపడంతో ఒకవైపు రైతుల్లో తీవ్రమైన నిరసనలు కమ్ముకుని ఉన్నవి. గతంలో ఎన్‌టిఆర్ వ్యవసాయానికి స్లాబ్ రేటు 75 రూపాయలు నిర్ణయించి వసూలు చేసేవారు. ప్రపంచబ్యాంకు ఒప్పందంలో భాగంగా చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు పేద రైతులకు భారంగా మారింది. బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు ఈ ఘటనలు తెలంగాణ ప్రజానీకంలో అసంతృప్తిని పెంచిపోషించాయి. ఇదే క్రమంలో తనకు బాబు కేబినెట్‌లో మంత్రి పదవి రాలేదని కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉంటూనే విద్యుత్ సంస్కరణలు తెలంగాణ బుడ్డగోచిని ఊడపీకె పరిస్థితులు వొచ్చాయని బాబు సంస్కరణలు వ్యతిరేకిస్తూ ఓ పత్రికలో వ్యాసం రాశారు. 2001లో ఇదే అదనుగా భావించిన మేము కాకతీయ విశ్వవిద్యాలయం నేను, ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ బియ్యాల జనార్ధనరావు, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మరికొందరు మేథావులు కలిసి కేసీయార్‌ను చాలా అంశాలు చర్చించాం. తెలంగాణ అధ్యయనానికి కొంత సమయం కావాలని కేసీఆర్ కోరారు. 1996 నుంచి 2001 వరకు కేయూ, వరంగల్ వేదిక తెలంగాణ ఉద్యమాన్ని మేథావులు, విద్యార్థులు, ఉద్యోగులు నడిపించారు. కేసీఆర్ రాకతో తెలంగాణ రాజకీయ ఉద్యమంగా రూపం ధరించింది. ఈ రాజకీయ ప్రక్రియ, పర్యవసానాలు 2009, డిసెంబరు వరకు కేసీయార్ నడిపారు. రాజకీయ ఉద్యమ ప్రక్రియలో ప్రతీ ఎన్నికల్లో మేధావులుగా విద్యావంతులను, ఉద్యోగులను చైతన్యం చేస్తూనే పరోక్షంగా బయటి నుంచి క్రియాశీలమైన పాత్రను పోషించాను. అప్పటికే కేసీఆర్ రాజకీయంగా ఒంటెద్దు పోకడలు పోతున్నట్లు తెలంగాణవాదుల్లో అసంతృప్తి, గులాబీ శ్రేణుల్లో నిరాశలు మొలకెత్తాయి. జయశంకర్ సార్‌తో కలిసి కేసీయార్‌తో చాలాసార్లు తగదని చెప్పాను.
మలిదశ తెలంగాణ ఉద్యమానికి టర్నింగ్ పాయింట్..?
పాపిరెడ్డి: కేసీయార్ దీక్షలు, తెలంగాణ ప్రకటన, యూటర్న్ తీసుకోవడం ఒక ఎత్తయితే శ్రీకాంతచారి ఆత్మబలిదానం తెలంగాణ సమాజాన్ని మరింత ఉద్వేగ పరిచింది. ఆందోళన ఉద్యమం మరింత మూలమలుపు తిరగడానికి కారణమైందని గుర్తించాలి. అదే సందర్భంలో హరిష్‌రావు పెట్రోల్ డ్రామాతోనే తెలంగాణలో యువతలో ఆత్మహత్యల పర్వం మొదలైంది. వాళ్ల బలిదానాలతోనే తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన కారణమైందని భావించాలి.

వరంగల్ జేఏసీ ఛైర్మెన్‌గా మీ పాత్ర..
పాపిరెడ్డి: తెలంగాణ ప్రకటన హామీని అప్పటి కేంద్ర కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకోవడంతో తెలంగాణ ఉద్యమం మళ్లీ ప్రజా ఉద్యమంగా రూపాంతరం పొందింది. ఇదే సందర్భంగా నేను కేయూ అకుట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. యానివర్శిటి నాలుగో తరతగతి ఉద్యోగులతో కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్మాణం చేసుకున్నం. అప్పటికే కేయూ విద్యార్థులు ధర్నాలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది. వెనక నుంచి విద్యార్థులకు కావాల్సిన సహాయసహకారాలు అందించి ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలిటికల్ జేఏసీ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో తెరాస, బీజేపీ, న్యూడెమోక్రసీ పార్టీలతోపాటు మిగతా విద్యార్థి, ఉద్యోగసంఘాలు కలిసి నడిచాయి. వరంగల్ జిల్లాలో కూడా పొలిటికల్ జేఏసీ ఛైర్మన్‌గా పనిచేయాలని అందరూ ఒత్తిడితో ఛైర్మన్‌గా పనిచేశాను. 2009 నుంచి 2014 వరకు రాత్రి పగలు తేడాలేకుండా ప్రజల మధ్యలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి అహోరాత్రులు కృషి చేశాను. అన్ని వర్గాలు నా పనితీరును ఆమోదించడం వల్లనే ఉద్యమాన్ని ముందుకు నడుపగలిగాను. ఎక్కడ వెనకడుగు వేయలేదు.

తెలంగాణ ఉద్యమంలో మీపై ఎన్ని పోలీసు కేసులు నమోదయ్యాయి..
పాపిరెడ్డి : తెలంగాణ ఉద్యమంలో ఐదేళ్లు తీవ్రంగా పనిచేశాను. నా మీద చాలా కేసులే పెట్టిండ్రు కానీ కోర్టు వరకు పోలీసులు తీసుకొనిపోలేదు. ప్రతీ ఆందోళన కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా ముందుండి నడిపించాను. ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్‌ను కావడం వల్లనేమో, లేదా కొందరు పోలీసు అధికారులు మా విద్యార్థులు కావడంవల్ల కూడా నాపై ఎలాంటి ఉద్యమ కేసులు నమోదు కాలేదనుకుంటాను. విద్యార్థులతోపాటు నేను స్వచ్ఛందంగా అరెస్టయ్యేవాడిని. స్టూడెంట్స్‌ను వొదిలేస్తే తప్ప ఇంటికి పోనని మొండికేసేది. యాకూబ్ రెడ్డిపై లాఠిఛార్జి ఘటనలో కూడా నేను ముందున్నాను. ఆ కేసు ఇప్పటికీ సుప్రీం కోర్టులో నడుస్తోంది. మేం చాలా వరకు సంయమనం పాటిస్తూ శాంతియుతంగానే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోరాటాలు చేశాను. మానుకోటకు జగన్ రాకను నిరసిస్తూ వరంగల్ జాక్ చేసిన పెద్ద నిరసన కార్యక్రమం. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాయినిగూడెం సభలో విద్యార్థుల నిరసనకు ముందు వ్యూహాత్మకంగా పనిచేశాను.

తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ కృషి ఏమిటి..
పాపిరెడ్డి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కృషి ప్రశంసనీయమైంది. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అటు సీమాంధ్ర నాయకుల నుంచి, ఇటు తెలంగాణ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో అధినాయకత్వాన్ని ఒప్పించడానికి శాయాశక్తులు ప్రయోగించారు. ఎంపీ జైపాల్ రెడ్డిలాంటి వారు సోనియాగాంధీని ఒప్పించడానికి బాగా పనిచేసిండు.

తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ నినాదం సంపూర్ణంగా అమలు జరిగిందా?
పాపిరెడ్డి : బాధాకరమైన విషయం ఎమిటంటే ఆత్మగౌరవం కోసం మొదలైన ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు వైపునకు ప్రయాణించింది. ఏ ఆత్మగౌరవం కోసం పోరాడినమో 2014 తర్వాత తెలంగాణలో కేసీయార్ ముఖ్యమంత్రయ్యాక ఉన్న గౌరవం కూడా ప్రజలు కోల్పోయారు. ఉద్యమం నుంచి అధినేత నియంతగా మారిండు. తెలంగాణ కోసం కొట్లాడినోళ్లను పక్కకు పెట్టిండు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వడం వల్ల ఉద్యమకారులు తీవ్ర అవమానానికి గురయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో కేసీఆర్ చాలా చెప్పిండు. చేసింది మాత్రం చాలా తక్కువ. నిధులు అనేవి యధాతదంగా వొస్తాయి. నీళ్ల విషయంలో కేసియార్ ప్రజలను మోసం చేసుకుంట వొచ్చిండు. కాళేశ్వరం కోటి ఎకరాలు ఒక అబద్దపు స్లోగన్. వాస్తవానికి కాళేశ్వరం సామర్ద్యం 18 లక్షల 26వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించడమే అధికారిక ప్రణాళిక లక్ష్యం. అసలు విషయం ఏమిటంటే కేసీయార్ సీఎం అయ్యాక తగినంతగా వర్షాలు రావడం ఆయన అబద్ధాలకు అతికింది. ప్రాజెక్టు కట్టిన తర్వాత 5 లక్షల ఎకరాలకు మించి సాగునీరు అందించలేదు. 2022 జులైలో అతి వర్షాల వల్ల కాళేశ్వరం ప్రాజక్టు మోటార్లు మునిగి కాలిపోయినవి. ఎత్తిపోతల కూడా జరగలేదు.

2022`23లో వర్షాధారం వల్ల ఖరీప్,రబీ పంటలు రికార్డుస్థాయిలో వొచ్చింది తప్పితే ఎత్తిపోతలు కాదని అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం మోటారు పంపులు మునిగా కాలిపోయాక నీళ్లు ఎలా రావు కదా! ప్రజలను నమ్మించడంలో కేసీయార్ దిట్ట. ఒక వేళ కాళేశ్వరం సక్సెస్ అయినా ఎకరాకు రూ.30 వేల పంట పండితే కరెంటు బిల్లు మాత్రం ఎకరాకు రూ.50వేల ఖర్చు భరించాలి. అందుకే కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు నిపుణులు చెప్తున్నారు. ప్రాజక్టు నిర్మిస్తే వొచ్చే కోట్ల రూపాయల కమీషన్ కోసమే నిర్మించిండు. కేసీఆర్ పరస్పర విరుద్దమైన స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఆయనకు అలవాటు. ప్రశ్నించిన మేధావులు,ప్రజాసంఘాలను, నిర్బంధించడం మరోవైపు మీడియాలను నియంత్రించడం ఆయన లక్షణం. ఉద్యోగ నియమాకాల విషయంలో అదొక పెద్ద వైఫల్యం జరిగింది. నోటిఫికేషన్లు అన్ని లోపభూయిష్టంగా చేసిండ్రు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పూర్తిగా దెబ్బతీసిండు. ఒక్క డిఎస్సీ కాని, యూనివర్శిటీలో ఖాలీలు నింపలేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పిన మాటలకు రాష్ట్రం వొచ్చాక చేసిన పనులకు పొంతన ఏమాత్రం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో వొచ్చినన్ని ఉద్యోగాలు తెలంగాణలో కనీసంగా రాలేదు. ఈ వైఫల్యాను ప్రజలు గమనించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోతే కనీసం ఆ కుటుంబాలను ఆదుకోలేదు. ఇక రైలు రోకో కేసులను ఇప్పటికీ ఎత్తివేయడానికి చర్యలు తీసుకోలేదు. కనీసం రైల్వే బోర్డుకు ఉత్తరం రాయమని కడియం శ్రీహరి, పసునూరి దయాకర్, మిగతా ఎంపిలకు చెప్పినా స్పందించలేదు.
మీరు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌గా పనిచేసి తెచ్చిన సంస్కరణలు..
పాపిరెడ్డి : హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ పదవి కేవలం ఒక సలహా మండలి మాత్రమే. కార్యనిర్వహణ అధికారాలు ఉండవు. ప్రతీ ఆరునెలలకోసారి ఉన్నత విద్యమీద సీఎం సమీక్ష వుంటుంది. ఖాలీ ఉద్యోగాలు రిక్రూట్‌మెంటు చేయమని కోరాను. రెగ్యులర్ వీసీలను నియామకం చేపట్టాలని సూచించాను. కాలానుగుణంగా కరిక్యులం తోపాటు పలు కోర్సుల్లో మార్పులు తేవాలని సలహాలిచ్చాను. ఉపాధి అవకాశాలివ్వగల కోర్సులను డిగ్రీ, పీజీ విద్యలో అమలు చేయాలని ప్రభుత్వానికి నివేదించాను. సీఎం ఏ విద్యాసమస్యను పట్టించుకోలేదు. ఆయన ఎజెండాలు వేరుగా ఉన్నయి. తర్వాత చూద్దాం అంటూ వాయిదాలు వేసే వారు. మూడోసారి ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌గా రెన్యువల్ చేయకపోవడంతో అలిగి బయటకు వొచ్చారని ఆరోపణ. పాపిరెడ్డి : అలాంటి ఆరోపణలో వాస్తవం లేదు. వాస్తవానికి నాకు రెండుసార్లు ఛైర్మెన్‌గా ఉండటానికి మాత్రమే అర్హత ఉంది. రెండో టర్మ్ తర్వాత ఎక్స్‌ట్రార్డినరి పరిస్థితుల కింద మరో ఏడాదిపాటు ఛైర్మెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి సీఎం అవకాశం ఇచ్చిండు. కేసీఆర్‌కు నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేయలేదు. మా మధ్య వైరుధ్యాలు ఏమీ లేవు. 65 ఏళ్ల తర్వాత ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం లేదు.

కేసీయార్ పనితీరును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..
పాపిరెడ్డి : గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి నియంతృత్వం రోజురోజుకు పెరిగిపోతుంది. యూనివర్శిటీ విద్య పట్ల, సమాజం పట్ల ఆయన ధోరణిలో నిర్లక్ష్యం పెరిగింది. అవినీతిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైండు. ప్రజలకు ప్రభుత్వ జవాబుదారితనం లోపించింది. పాలనలో నియంతృత్వం పెరిగిపోతుంది కావున ప్రత్యామ్నాయ మార్పు అవసరం ఉందని భావించి కాంగ్రెస్‌లో చేరాను.

కాంగ్రెస్‌లో ఏ స్థాయిలో పనిచేస్తున్నారు..
పాపిరెడ్డి : నేను ఎలాంటి హోదాల కోసం చేరలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం సాధారణమైన వ్యక్తిగా క్షేత్రస్థాయిలో నాకున్న అనుభవంతో గెలుపుకోసం పనిచేస్తున్నాను. ఒక బలమైన పార్టీని దించడానికి మరొక బలమైన శక్తి కలిగిన పార్టీ అవసరం. దానికి మరింత శక్తిని ఇవ్వడానికే కాంగ్రెస్‌లో చేరాను. నాలాంటి విద్యావంతులు చాలా మంది గెలుపు కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో మార్పు రావాలని నా వంతుగా నేను పనిచేస్తున్నాను. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చినా ఏమీ ఆశించడం లేదు. అన్‌కండీషనల్‌గా పార్టీలో చేరాను.

అంతిమంగా తెలంగాణ ప్రజలకు మీరిచ్చే సందేశం..
పాపిరెడ్డి : కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి అంతులేకుండా పోయింది. నియంతృత్వ పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయింది. చివరికు మీడియా సమావేశాల్లో ప్రశ్నించే పాత్రికేయులను సైతం సీఎం అవహేళన చేయడం నియంతృత్వానికి నిదర్శనమే. కనుక ప్రజలు ఈసారి కొంత విజ్ఞతగా ఆలోచించి మార్పు కోసం వోటేయాలని కోరుతున్నాను. చిన్నచిన్న విషయాలకు భ్రమలకు లోనుకావద్దని ప్రజలను కోరుతున్నాను. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వొస్తే మాత్రం తెలంగాణ సంపదలు ఉండవు. ప్రజలకు శాంతి,భద్రతలు అసలే దొరకవు. పోలీసు రాజ్యం రావడం ఖాయం. ఎమ్మెల్యేలు ఖబ్జాలతోని మీ సొంత భూమి జాగలు సైతం అక్రమిస్తారు జాగ్రత్త. ఇప్పటి పరిస్థితుల్లో బి.ఆర్.ఎస్‌కు ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ మాత్రమే. అందుకే కాంగ్రెస్‌కే వోటువేయాలని కోరుతున్న. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎం.ఐ.ఎం. మూడు అంతర్గత ఒప్పందాలతో ఒక్కటయి నవి. వీళ్లను నమ్మకూడదు. వొచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పనిచేయడానికి పౌరసమాజం పనిచేయాలని కోరుతున్నాను. ప్రశ్నించే ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్‌లపై నిర్బంధం , అక్రమ కేసులు పెట్టడం చాలా అన్యాయం.

రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అణచివేత, అవినీతి, నియంతృత్వానికి పాల్పడితే..
పాపిరెడ్డి: ఇప్పుడు పౌర సమాజం చాలా మేల్కొన్నది. అందులో యువతరం, విద్యార్థి లోకం చాలా సామాజిక స్పృహను కలిగి వుంది. కాంగ్రెస్ బహుళ నాయకత్వం వుంటుంది. ఏకఛత్రాధిపత్యం చెల్లదు. అధినాయకత్వం వుంటుంది. కాని కేసీయార్ వొచ్చినంకనే ప్రతిపక్షం లేకుండా గుంజుకొని కల్పుకున్నడు. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం ఎక్కడ వుంటుంది. విపక్షాలను ప్రలోభాలకు గురిచేసి దురాలోచనతో ఎమ్మెల్యేలు కొన్నడు. రేపటి ప్రభుత్వం దారి తప్పినా వొత్తిడి తెచ్చి అభివృద్ధి పనులు చేయించుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంది. ప్రజల కోసం నేను మళ్లీ ప్రజాఉద్యమాలకు సిద్ధంగా ఉంటాను.
-కోడం కుమారస్వామి, కాళోజీ జంక్షన్ (హన్మకొండ),
ప్రజాతంత్ర