టీపిటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కనకయ్య
జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయేందర్ రెడ్డి
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: టీపీటీఎఫ్ కొండపాక మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ కనకయ్య, జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ… ఉపాధ్యాయ,విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్, పెండింగ్ డిఏ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రమోషన్లకు అర్హత అయిన టెట్ ను మినహాయింపు కానీ,లేదా క్వాలిఫై కావడానికి నిర్ణీత గడువు ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇచ్చి ప్రమోషన్లు బదిలీలు చేపట్టాలని,అదేవిధంగా బదిలీ ఉత్తర్వులు పొంది రిలీవ్ కానీ ఉపాధ్యాయులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రిలీవ్ చేయాలని అదే విధంగా ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ఎన్ ఉన్నత పాఠశాలలో ఉన్నతి ప్రోగ్రాం వలన ఉపాధ్యాయులకు పేపర్ వర్క్ ఎక్కువ తరగతి గదిలో బోధనకు ఆటంకం కలుగుచున్నది కావున పై రెండు ప్రోగ్రాం లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిటి ఏఫ్ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నమల్ల రాములు,జి.తిరుపతి రెడ్డి,కే.రామస్వామి,కే.కనకయ్య, కే.రామచంద్రం,పి.శంకర్ యస్. కనకయ్య, జే,వెంకటయ్య, డి.రాములు అంజయ్య, లక్ష్మారెడ్డి, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.




