ఉద్యోగాలలో కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు పొందాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 5 : కష్టంతో కాకుండా..  ఇష్టంతో చదివి పోలీసు ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులు మంచి శిక్షణ పొంది ఉద్యోగాలలో స్థిరపడిన తర్వాత అదే విధంగా కష్టపడి తల్లిదండ్రులు, గ్రామాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పిటిసి వెంకటేష్ గుప్తా అన్నారు. మంగళవారం నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీలో శిక్షణ పొంది సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించిన 64 మంది యువతి యువకులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్  ఘనంగా సన్మానించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల వేంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి శక్తినైన పొందవచ్చనీ ఈ ఫలితాలే దానికి నిదర్శనమనీ ఆయన పెర్కోన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే ఒక ఆశయం, సంకల్పం పెట్టుకొని కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొంది సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించిన యువతకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎంతటి గుర్తింపు పొందిన పుట్టిన గడ్డను కన్నా తల్లిదండ్రుల పట్ల గౌరవం మర్యాదలు ఇచ్చి వారిని కాపాడుకోవాలనీ ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపిపి నిర్మలశ్రీశైలం గౌడ్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, నందు ఆర్మీ పౌండర్, సర్పంచ్‌లు లలితజ్యోతయ్య, హనుమాన్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్ యాదవ్, చుక్కపూర్  మాజీ ఎంపిటీసి యాదయ్య, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ ఉప్పల ఆఖిల్, తావుర్య నాయక్, రజినికాంత్, రవి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *