ఉద్యమకారుడు ప్రజా గాయకుడు గద్దర్ మరణం తీవ్ర విషాదకరం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణానికి చింతిస్తూ సోమవారం అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ లో గద్దర్  చిత్రపటానికి  పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్  పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మన్నె రవీందర్, ట్రెజరర్ సుధాకర్, జనరల్ సెక్రెటరీ మహేష్, రమేష్ యాదవ్, నాయకులు కె శ్రీనివాస్, రవీందర్, ప్రకాష్, ఈశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, విజయ్, మల్లేష్, భిక్షపతి, సతీష్, రాములు, క్రిష్ణ, శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *