ఉజ్జయినిలో ఉద్రిక్తత రణ్‌బీర్‌, ఆలియా భట్‌ల రాకపై నిరసనలు

ఉజ్జయిని, సెప్టెంబర్‌ 7 : ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్‌ ఆలయం వద్ద ఇవాళ ఉద్రిక్తత నెలకొన్నది. విశ్వహిందూ పరిషత్‌, ‌భజరంగ్‌ ‌దళ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలీవుడ్‌ ‌జంట రణ్‌బీర్‌ ‌కపూర్‌, ఆలియా భట్‌ .. ‌మహాకాలేశ్వర్‌ ఆలయాన్ని బుధవారం సందర్శించాల్సి ఉంది. అయితే దానికి ముందే విశ్వహిందూ, భజరంగ్‌ ‌దళ్‌ ‌సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల జెండాలతో బాలీవుడ్‌ ‌జంటకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆందోళనకారుల్ని తరిమేందుకు పోలీసులు లాఠీలకు పని పెట్టారు. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్‌లో భాగంగా డైరక్టర్‌ అయాన్‌ ‌ముఖర్జీతో కలిసి ఆలియా, రణ్‌బీర్‌ .. ‌మహాకాలేశ్వర్‌ ఆలయాన్ని దర్శించాలనుకున్నారు. మహాకాలేశ్వరుడి దర్శనం చేసుకోకుండానే ఆలియా, రణ్‌బీర్‌లు ఇండోర్‌ ‌చేరుకున్నారు. కేవలం దర్శకుడు అయాన్‌ ‌ముఖర్జీ మాత్రమే ఆలయ దర్శనం చేసుకున్నాడు. బీఫ్‌ ‌తింటానని గతంలో రణ్‌బీర్‌ ‌చేసిన కామెంట్‌ ‌మళ్లీ ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో భజరంగ్‌ ‌దళ్‌ ‌రణ్‌బీర్‌ ‌రాకను నిరసిస్తూ ఆందోళన చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *