ఉచిత విద్యుత్‌ ‌కాంగ్రెస్‌ ‌ఖాతాలో లేదు

  • రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దన్నదే వారి పాలసీ
  • రేవంత్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15: రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దన్న రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేగుతూనే ఉంది. ఉచిత విద్యుత్‌ ‌రద్దు అనేది జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీ పాలసీగా ఉందని మంత్రులు జగదీష్‌ ‌రెడ్డి,నిరంజన్‌ ‌రెడ్డిలు అన్నారు. కాంగ్రెస్‌ ‌తీరుకు వ్యతిరేకంగా మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జగదీష్‌ ‌రెడ్డి డియా సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల కరెంట్‌ ఇవ్వొద్దనే చర్చ కాంగ్రెస్‌ ‌పార్టీ ఎందుకు తెచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ మనసులో ఉన్న అసలు విషయాన్ని వాళ్లు ముందే తొందరపడి బయటపెట్టారని చెప్పారు. రైతులకు 24 గంటల కరెంట్‌ ఎం‌దుకు అందుబాటులో ఉండొద్దని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకత్వం 24 గంటల కరెంట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి లభ్యత ఉన్నా ఇవ్వడం లేదని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. చత్తీస్‌ ‌గఢ్‌ ‌నుంచి ఇతర రాష్టాల్రకు అమ్ముతు న్నారు తప్ప, అక్కడి ప్రజలకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ ‌వద్దు అంటే ఆయన వెంట తిరుగుతున్న నాయకులు చప్పట్లు కొడుతున్నారని, ఉచిత విద్యుత్‌ ‌రద్దు అనేది జాతీయ కాంగ్రెస్‌ ‌పాలసీయేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ విధానంపై రైతాంగం చర్చ జరపాలన్నారు. రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌  ‌పార్టీకి ఇష్టంలేనట్లు ఉందని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆత్మ, భావం ఆ పార్టీకి తెలియవని విమర్శించారు. వేలాది మంది బలిదానాలు చేసుకుంటుంటే కాంగ్రెస్‌ ఏనాడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ యాస, భాషను అవమానించిందన్నారు.

తెలంగాణను పోరాడి సాధించుకున్నామని.. కాంగ్రెస్‌ ఇవ్వలేదన్నారు. ఆ పార్టీ నాయకుల్లో తెలంగాణ ఇచ్చామనే మాటల్లోనే అహంకారం కనిపిస్తుందన్నారు. తెలంగాణలో ఏ పరిణామం జరగాలన్నా ఢిల్లీలో స్విచ్‌ ‌నొక్కితేనే కాంగ్రెస్‌లో నడుస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి తెలంగాణ మాత్రమే ఒక ఆత్మని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారంతో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. అప్పుడు టీడీపీలో ఉన్నకేసీఆర్‌.. ‌చంద్రబాబుని ఎదిరించారని తెలిపారు. అప్పుడే నీళ్లు, నిధులు, నియామకాలపై పోరాటం మరింత ఉధృతమయ్యిందని తెలిపారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన లేకుండా సబ్‌స్టేషన్‌ ‌దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ కరెంట్‌ను పట్టుకుని షాక్‌కు గురైందని చెప్పారు. ఆ పార్టీ దేశంలో విద్యుత్‌పై ఒక విధానమంటూ లేదని విమర్శించారు. తొందరపాటులో అన్న మాటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌ ‌పార్టీకి ఇష్టం లేనట్లు ఉందని అన్నారు. ఆ పార్టీలో నాయకుడికో విధానం ఉంటుందని ఎద్దేవాచేశారు.

చంద్రబాబు అభిమానులు ఏర్పాటు చేసిన టింగులో మూడు గంటల కరెంట్‌ ‌చాలంటూ ఆయన శిష్యునిగా రేవంత్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దని కాంగ్రెస్‌ ‌పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఖండిస్తే బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించే విధంగా రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రైతులను తక్కువ చేసి మాట్లాడుతున్న రేవంత్‌ ‌రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *