విద్యుత్ విషయంలో కాంగ్రెస్ మాత్రమే న్యాయం చేసింది
కెసిఆర్ పాలనలో ఇరిగేషన్ రంగం దెబ్బతింది
కాంగ్రెస్ వొస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది
డియా సమావేశంలో భట్టి విక్రమార్క
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై15:
శనివారం ఉచిత విద్యుత్, తెలంగాణ మంత్రులపై భట్టి డియాతో మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పెద్ద ఫ్రాడ్ అని అన్నారు. ధరణి ఒక దుర్మార్గమైన సాప్ట్వేర్ అంటూ మండిపడ్డారు. ఏ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదన్నారు. పైపులు, ట్యాంకులు ఉన్నాయి గానీ నీళ్ళు రావడం లేదన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని స్పష్టం చేశారు. కరెంట్ కోసం బీఆర్ఎస్ చేసింది ఏంటి అని ప్రశ్నించారు. భద్రాద్రి, యాదాద్రి ఇంకా వెలగడం లేదన్నారు. బీఆర్ఎస్ మంత్రులకు అవగాహన లేదని విమర్శించారు. ఒక్కో రాష్టాన్రికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుందనే విషయం తెలంగాణ మంత్రులకు లేదన్నారు. ఉచిత విద్యుత్‌పై కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని..
ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్ చేసింది ఏంటి అని ఆయన ప్రశ్నించారు. 1999 మేనిఫెస్టో లోనే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పామన్నారు. ‘మేము చేసిన పనిని కంటిన్యూ చేస్తూ మేం చేస్తున్నాం అని చెప్తే ఎలా?‘ అంటూ నిలదీశారు. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ పని అయిపోయిందన్నారు. ఎత్తిపోయిన బీఆర్ఎస్ గురించి ఏం మాట్లాడుతాం అంటూ వ్యాఖ్యలు చేశారు. పారే ప్రతి నీటి బొట్టు, పండే ప్రతి గింజ గత ప్రభుత్వాల ఘనత మాత్రమే అని చెప్పుకొచ్చారు. లక్షల కోట్ల రూపాయలు దండుకోవడం తప్పా కేసీఆర్ ఏం చేయలేదన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు అనేది కాంగ్రెస్ పాలసీ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి సంస్థ రాష్ట్ర అస్థి. గనులన్ని సింగరేణికి ఉండేలా చూస్తామన్నారు. ప్రభుత్వ అండతో ప్రైవేట్ సంస్థలు శ్రమ దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. ధరణి వల్ల లక్షల మంది తమ భూములపై హక్కులు కోల్పోయారన్నారు.
ధరణి వల్ల ప్రజలకు చాలా నష్టం కలిగిందని భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంపద ప్రజలకు పంచడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో ఫ్యూడల్స్, దేశంలో క్యాప్టలిస్టులు కలిసి తెలంగాణని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల అవసరాలే తమ అజెండా అన్నారు. ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వాన్ని తెస్తామని మాట ఇస్తున్నామన్నారు. సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయని అన్నారు. తాము ఏం చేశామో ప్రజలకు తెలుసన్నారు. తొమ్మిది ఏండ్లలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దోచేస్తున్నారని ఆరోపించారు. ధరణి అనేది మహమ్మారిలాగా అయిందన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలని ప్రజలు అడిగారన్నారు. చేనేత కార్మికులు జీఎస్టీ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని చూస్తున్నారని అన్నారు. సింగరేణిని బొంద పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని విద్యార్థులు అనుకుంటున్నారన్నారు. ధరణితో తమ భూములు తమకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చారు. తెలంగాణలో స్వేచ్ఛనే లేకుండ పోయిందన్నారు. భయంభయంగా బతకాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతిలోకి పోయిందన్నారు. 20 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ రియల్టర్ ఒక పక్కన… కట్టుకోవడానికి 20 గజాల స్థలం లేని వాళ్ళు ఒక పక్కన ఉన్నారన్నారు. వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంటున్న కాంట్రాక్టర్ ఒక పక్కన…. తినడానికి తిండి లేని ప్రజలు మరోపక్క అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు.



