ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  సిద్దిపేట  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం నంగునూరు మండలం గట్లమాల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని  సిద్దన్నపేట గ్రామంలో  ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి కంటి ఆపరేషన్ కోసం అవసరమైన వారిని గుర్తించడం జరిగింది.శిబిరంలో గుర్తించిన వారిని త్వరలోనే ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బెదురు తిరుపతి,మాజీ సర్పంచ్  ఫురెందర్, అఫ్తాల్మీక్ ఆఫీసర్ భద్రయ్య,హెల్త్ అసిస్టెంట్ భాస్కర్ బట్లు, ఆశలు,అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *