ఉ‌క్రయిన్‌-‌రష్యా యుద్ధం

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా
అగ్రరాజ్యం రష్యా దూకుడు ఆగడం లేదు,
విశ్వానికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన రష్యా
ట్రాక్‌ ‌తప్పి మారణ హోమం చేస్తూ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నది!
మూడేళ్ళపాటు చిచ్చు లేపిన
విశ్వకరోనా మహమ్మారి కొంచెం
కొంచెం శాంతించిన తర్వాతనైనా
ప్రపంచ శాంతి కోసం పాటుపడాల్సిన రష్యా
యుద్దోన్మాదంతో సరికొత్తగా ఉరకలు వేస్తున్నది!
పసిగుడ్డు ఉక్రేయిన్‌ ‌పై  ఏడాది పొడవు నుండి
అదుపు తప్పి భీకర యుద్దం చేస్తున్నది,
రకరకాల మిసైళ్ళతో ముష్టిఘాతాలు కురిపిస్తున్నది!
జనకళ్యాణంతో తులతూగుతున్న ఉక్రయిన్‌
‌నగరాలకు నగరాలే స్మశానాలుగా మారిపోతున్నాయి,
జనుల బతుకులు అధోగతవుతున్నాయి,
ఆయుధ ప్రకోపాలకు పేకమేడల్లా భవనాలు కుప్పకూలి  పోతున్నాయి,
ఏడాది గడిచినా కాసింతైనా ఉక్రోశాన్ని తగ్గించుకోని
వాల్దిమిర్‌ ‌పుతిన్‌ ‌విశ్వవినాశానికి ఏకపక్షంగా
తన వంతుగా మహోద్రగ్రుడై ఆజ్యం పోస్తున్నాడు,
ఒక పక్క అపర్యావరణంతో
ధృవాల్లోని మంచు ఖండాలు కరుగుతూ
సముద్రమట్టాలు పెరుగుతుంటుంటే,
మరో పక్కా అణ్వాస్త్రాలు కలిగి యున్న
రష్యా హద్దులు  చెరుపుతూ ప్రవర్తిస్తున్నది,
విశ్వకూటమి ఐక్యరాజ్య సమితి అర్థించినా కన్నెత్తయినా
చూడని రష్యా భిన్నంగా వ్యవహరిస్తు,
చైనాతో మిలాఖతై మరింత విశ్వవినాశానికే
దోహదం చేయడానికి రంకె వేస్తున్నదా?
అగ్రరాజ్య పెత్తందారీ తనాల ముసుగులో
రష్యా, అమెరికాలు  పోటీ పడుతూ
పరోక్షంగా తమ కసిని తీర్చుకొంటు
పెను బుసలు కొతుతున్నాయి!
సయోద్యకు పాటు పడాల్సిన యూరప్‌,
‌పశ్చిమ దేశాలు కొతి చేష్టలు చేస్తూ,
వెనక నుండి ఉక్రయిన్‌ ‌కు
చేతనైన ఆయుధ సాయం అందిస్తూ
యుద్ద భీభత్సాన్ని మరింత తీవ్రతరంతో రెచ్చగొడ్తున్నాయి,
ఆఘ్పనిస్తాన్‌ ‌లో బలగాలు వెనక్కి తీసుకొన్న
అమెరికా చర్య వల్ల తాలిబాన్ల పాలకుల చేతిలో
అక్కడి రాజ్యం నరపీడనమై పోయింది,
పొరుగున ఉన్న పాకిస్థాన్‌ ‌ను
పెను ఉగ్ర దాడులతో వణికిస్తున్నది,
ప్రకృతి విలయం భూకంపాలతో దద్దరిల్లిన
టర్కీ, సిరియాలు
భారీ ప్రాణ, ఆస్తి నష్టాల్ని ఎదుర్కొంటున్నాయి…
కరువుకోరల్లో శ్రీలంక, పాకిస్థాన్‌ ‌తో సహా ఆఫ్రికన్‌ ‌రాజ్యాలు
అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి,
ప్రధాని మోడీ మంత్రాంగం నెరపి,
జి-20 తరపునుండి అభ్యర్థించినా
మిత్రదేశమైన రష్యా కోడిపిల్లలపై సింహగర్జనలు చేస్తున్నది,
ఆకలి, కరువు, అతీవృష్టి, అడవుల కార్చిచ్చులు,
అగ్ని ప్రమాదాలు, సముద్రాల తుఫాన్‌ ‌లు, భూకంపాలు,
ఊష్ణతాపం, ఉగ్రవాదాలు, అంతర్యుద్దలతో
తలకిందులవుతున్న ప్రపంచ దేశాలకు అండగా నిలవాల్సిన
అగ్రరాజ్యాలు గీత దాటి మొరటుగా కాలుదువ్వుతున్నాయి,
ప్రపంచ ప్రళయానికి తామే ముందున్నామనన్నట్లుగా…
కొనసాగుతున్న యుద్దంలో ఏడాదిలో
సుమారు రెండు లక్షల మంది క్షతగాత్రులై
హతుల జాబితాలో చేరిపోయారు,
క్షమయా ధరిత్రి సహించలేదు,
ఉక్రయిన్‌ ‌యుద్దముగింపుకు చర్చలే శరణ్యం,
ఐక్యరాజ్య సమితి సూచనలే శిరోధార్యం కావాలి!
– సంకేపల్లి నాగేంద్రశర్మ, కరీంనగర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *