ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి..! మంత్రి హరీష్ రావు

 

రాష్ట్రం లో అతి తక్కువగా వరి సాగు చేసినా జిల్లా సంగారెడ్డి.. ఇక్కడ రైతులు వాణిజ్య పంటల సాగు చేస్తున్నారు..అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళ వారం సంగారెడ్డి జిల్లా స్థాయి వానాకాలం సాగు సన్నాహక సమావేశం లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పచ్చి రొట్ట విత్తనల సాగు పెరగాలి..గత ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోలేదు..మంజీరా నది పై 12 చెక్ డ్యామ్ నిర్మాణం చేశాము..అని తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కుడా ఇవ్వలేని వారు…తెలంగాణ ప్రభుత్వము ను విమర్శిస్తున్నారని తెలుపుతూ..రైతు బంధు కాఫీ కొట్టి కేంద్రం పి ఎం కిషన్ యోజన పేరుతో ఇస్తున్నారు..సంగారెడ్డి జిల్లా లో రైతు బంధు ప్రారంభ ఏడాది లో 270 కోట్ల ఉంటే … ఇప్పుడు 370 కోట్లు ఇస్తున్నాము..తెలంగాణ రైతు ప్రయోజల కోసం బావుల వద్ద మీటర్లు రాకుండా చేస్తున్నాము..

ఏ ఈ ఓ లు రైతులతో కలిసి మార్పు కోసం ప్రయత్నం చేయండి..అని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ బిబి పాటిల్, రైతు బంధు అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మేల్యేలు క్రాంతి కిరణ్ , మాణిక్ రావు, స్థానిక నేతలు,వ్యవసాయ శాఖ అధికారులు..పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *