ఈ నెల 18 నుండి గణేష్ గడ్డ సిద్ది గణపతి వార్షిక బ్రహ్మోత్సవాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ది గణపతి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి  28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు, రథోత్సవం, లడ్డు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్, అన్నదాన సత్రాలు నిర్మిస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ రెడ్డి, ఎంపీటీసీ రాజు, మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఆలయ ఈవో మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *