ఈ నెల 17న రవీంద్రభారతిలో మ్యాన్ ఆఫ్ వరల్డ్ ఆడిషన్స్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : తెలుగు రాష్ట్రాల యువకులకు మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆడిషన్స్ కు పెన్సిల్-9 ఫౌండర్ రిషిత ముఖర్జీ ఆహ్వానం పలికారు. ఈ మేరకు బుధవారం హైదర్గూడా ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రావ్య చల్లతో కలిసి ఆమె మాట్లాడారు. ఈ నెల 17వ తేదీన నగరంలోని రవీంద్రభారతిలో 18 సం.లు నిండిన యువకులకు మ్యాన్ ఆఫ్ వరల్డ్ ఆడిషన్స్ నిర్వహిస్తుందని తెలిపారు. మొట్ట మొదటిసారిగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువకులకు ఈ ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఆడిషన్స్ లో విజేతలుగా నిలిచిన వారికి 15 వేల డాలర్ల క్రౌన్ తో పాటు రెండు వేల డాలర్ల బహుమతి, వి పర్యటన.. ఐకాన్ ప్రోడక్ట్ సంస్థతో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ఉంటుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆడిషన్స్ లో విజేతగా గెలుపొందిన వారిని మ్యాన్ ఆఫ్ ది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టైటిల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాల కోసం ఫోన్ 8886884235 నెంబర్లో సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *