చిన్నకోడూరు,ప్రజాతంత్ర, నవంబర్ 4: ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు తరలి రావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు జేరిపోతుల లక్ష్మణ్ మాదిగ అన్నారు. మండల పరిధి రాముని పట్ల గ్రామంలో కరపత్రాలతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 30 సంవత్సరాలుగా ఏ,బి,సి,డి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు.నిజాయితీగల పోరాటానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ సభకు వస్తున్నారని.. ప్రతి ఒక్కరూ చిన్న, పెద్దా అని తేడా లేకుండా కుటుంబాలతో సైతం భారీ బహిరంగ సభకు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో సాయిలు, మాణిక్యం,రవీందర్, జీవరత్నం,దేవదాసు,రాజు, ఎల్లయ్య,మల్లేశం,రమేష్, సాయిలు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 11న జరిగే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు తరలిరావాలి



