దత్తత కాదు దమ్ముంటే కొడంగల్ లో పోటీ చెయ్..
కొడంగల్ లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే
నిధులన్నీ సిరిసిల్ల సిద్దిపేటకు
ఉత్త హామీలు కొడంగల్ కా..
మోసపోకండి గోసపడతాం కొడంగల్ ప్రజలు ఆలోచించండి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
ప్రజాతంత్ర కోడంగల్ నవంబర్ 6: కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం తనకు వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయానికి కారణమైన డీకే శివకుమార్‌ను మించిన తీర్పును కొడంగల్ ప్రజలు తనకు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆయన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో కొడంగల్ చేరుకొని, పురపాలక కేంద్రంలోని గడిబాయి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి తన స్వగృహానికి చేరుకొని, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు… మీ ఆశీర్వాదమే అండగా, మీరిచ్చిన బలంతో ఈ కొడంగల్ ఖ్యాతిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టానని, కొడంగల్ సమాజమంతా కూర్చుని ఆలోచన చేయాలన్నారు.కాంగ్రెస్ జెండా ఎగురవేయమని లక్షలాది మంది కార్యకర్తలు తనను ఆశీర్వదించారని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్‌లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే అని అన్నారు. తనకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. తనకోసం కాదని.. కార్యకర్తలు, ప్రజల కోసమేనని పేర్కొన్నారు. తనకు పదవి లేకపోయినా కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని చెప్పారు. ఈ ఐదేళ్లలో ఈ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ ఎలా ఓట్లు అడుగుతుందని రేవంత్‌రెడ్డి నిలదీశారు.తెలంగాణ రాజకీయాల్లో ఇంత గొప్ప అవకాశం కొడంగల్ కు వచ్చింది, కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాది కాదు, మీదే అన్నారు. కొడంగల్ లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ కు అధ్యక్షుడే అని తెలిపారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. కృష్ణా రైల్వే లైన్, జూనియర్, పీజీ కాలేజీలు, కృష్ణా జలాలు వస్తాయని ఆనాడు కేసీఆర్ ప్రజలను నమ్మించారన్నారు. ఐదేళ్లలో కొడంగల్ కు కేసీఆర్ , కేటీఆర్ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదని, ఓట్లు ఎలా అడుగుతారనీ ప్రశ్నించారు. నిధులన్నీ సిరిసిల్ల, సిద్దిపేట,గజ్వేల్ కేనా… కొడంగల్ కు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. దత్తత కాదు ధైర్యం ఉంటే కొడంగల్ లో పోటీ చెయ్ తేల్చుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరారు .అభివృద్ధి చేయలేదు కాబట్టే నేను విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించలేదని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు, కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయాని, ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు.. ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ఎన్నికలు అన్నారు. దేశ ముఖ చిత్రంలో కొడంగల్ కు ఒక గుర్తింపు తెచ్చే ఎన్నికలు. గ్రూపులు, గుంపులు కాదు.. కొడంగల్ అంతా కలిసి రావాలి… కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. కాంగ్రెస్ జెండా ఎగురవేయమని లక్షలాది మంది కార్యకర్తలు తనను ఆశీర్వదించారని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్‌లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే అని అన్నారు. తనకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. తనకోసం కాదని.. కార్యకర్తలు, ప్రజల కోసమేనని పేర్కొన్నారు. తనకు పదవి లేకపోయినా కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని చెప్పారు. ఈ ఐదేళ్లలో ఈ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ ఎలా ఓట్లు అడుగుతుందని రేవంత్‌రెడ్డి నిలదీశారు.చీలిపోతే కూలిపోతాం.. కూలిపోతే మీ జీవితాలు ఆగమై తాయని అన్నారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ కంటే ఎక్కువ మెజారిటీతో కొడంగల్ లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. అశేషంగా( భారీగా) తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో,తన గృహము నుండి అంబేద్కర్ కూడలి గుండా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, నామినేషనల్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ గురునాథ్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి ఎనుముల తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, శ్రీరాంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





