- సాధారణ ఎన్నికల్లో బిజెపికి దెబ్బతప్పదు
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే
న్యూదిల్లీ,మార్చి2: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్టాల్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఉండదని కాంగ్రెస్ విశ్లేషించింది. సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సమర్థించారు. సాధారణంగా ఈశాన్య రాష్టాల్లోన్రి పార్టీలు కేంద్ర ప్రభుత్వంవైపు వెళ్తూ ఉంటాయని చెప్పారు. అయితే చాలా మంది నేతలు జాతీయ రాజకీయాలకు కట్టుబడి ఉంటారని తెలిపారు. అటువంటి వారు కాంగ్రెస్, లౌకికవాద పార్టీలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలకు మద్దతిస్తారన్నారు. ఈశాన్యా రాష్టాల్రైన మేఘాలయ, త్రిపు,నాగాలాండ్‌లలో ఇటీవలే ఎన్నికలు ముగియగా.. ఈ మూడు రాష్టాల్ల్రో ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం వీటన్నిటిలోనూ బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఖర్గే డియాతో మాట్లాడుతూ, ఈశాన్య రాష్టాల్ల్రోని రాజకీయాలు వేరుగగా ఉంటాయన్నారు. పార్టీలు సాధారణంగా లౌకికవాద పార్టీలకు మద్దతిస్తాయన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ కూటమి ఏర్పడటానికి ఈ పార్టీలు అనుకూలంగా ఉంటాయన్నారు. తమతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ముందడుగు వేయాలని ఈ పార్టీలు కోరుకుంటాయన్నారు. ఇదిలావుండగా, నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. త్రిపురలో బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మేఘాలయలో బీజేపీ గతం కన్నా మూడు స్థానాలను ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది.



