ఈవీఎంల రక్షణ చర్యలను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  గోదాములలో భద్రపరిచిన ఈవీఎంల రక్షణ చర్యలను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.జిల్లా కేంద్రంలోని ఇందూరు కళశాలలో  నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం మిషన్లను కలెక్టరేట్ పక్కనగల ఎన్నికల సంఘం గోదాం మరియు కొండపాక మార్కెట్ కమిటీ గోదాములలో భద్రపరిచారు.  సోమవారం జిల్లా కలెక్టర్ ఆయా గోదాములను సందర్శించి గోధుమల వద్ద చేపట్టిన రక్షణ చర్యలను పరిశీలించి అక్కడ  విధులు నిర్వర్తిస్తున్న పోలిస్ అధికారులతో మాట్లాడారు. ఈవీఎంలకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  గట్టి బందోబస్తు నిర్వహించాలని అన్నారు. ఎలాంటి సమస్య ఎదురైన అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పోలిస్ సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పించాలని ఎఓ కి తెలిపారు. లాగ్ బుక్, విసిటర్ రిజిస్టర్ ను తప్పనిసరిగా నిర్వహణ చేయాలని తెలిపి లాగ్ బుక్ లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *