ఈనెల 9న  లోక్ అదాలత్ ను సద్వినియోపరుచుకోండి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 : సెప్టెంబర్ 9వ తేదీన ఆమనగల్లు కోర్టు నందు జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ లో  తమ తమ కేసులను రాజీ చేసుకోవాలని ఆమనగల్ సిఐ వెంకటేశ్వర్లు కోరారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆమనగల్లు సర్కిల్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ పోలీస్ స్టేషన్ లలో ఉన్న కేసులలో రాజీ కాదలచిన వారు రాజీ చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. క్షణికావేశంలో కానీ, ఇతర సమస్యల వల్ల కొందరు అనుకొని పరిస్థితుల్లో క్రిమినల్ కేస్ లలో ఇరువర్గాలు మాట్లాడుకుని రాజీ కాదగ్గ కేసుల వారు ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. అదేవిధంగాడ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లలో, ఎక్సైజ్ కేసు లలో  అక్రమ ఇసుక రవాణా కేసు లలో పట్టుబడిన వారు నేరం ఒప్పుకుంటే వారికి ఫైన్ విధించి కేస్ లను క్లోజ్ చేయడం జరుగుతుందన్నారు.  కావునా అందరూ కూడా ఈ లోక్ అదాలత్ ను సద్వినియోగ పరచుకోవలని సిఐ వెంకటేశ్వర్లు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *