ఈనెల 3న సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 1: ఈనెల 3న శ్రీ సంతోషిమాత 29వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వహకులు మోని గారి సరోజా పండరినాథ్ తెలిపారు. ఈనెల 3న శుక్రవారం సంతోషిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం పుణ్యవచనం అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటలకు భగవద్గీత విష్ణు సహస్రనామ హనుమాన్ చాలీసా పారాయణములు మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం ముఖ్య వక్త గొల్లపల్లి అంజిరెడ్డి సి నాగభూషణం రఘునాథ్ పంతులు గార్లచే ధార్మిక ప్రసంగాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సంతోషిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *