ఈనెల 27, 29 తేదీల్లో సదరం క్యాంపులు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సదరం క్యాంపుకు సంబంధించి నేడు (శనివారం) ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 , 29 తేదీల్లో  తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు  స్లాట్ బుక్ చేసుకున్న  అంగవైకల్యం గల దరఖాస్తుదారులు హాజరుకావాలని ఆయన తెలిపారు. అదే విధంగా ఈ నెల 27,  30 వ తేదీల్లో వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించే క్యాంపులకు హాజరుకావాలని కలెక్టర్  తెలిపారు. ఇట్టి క్యాంపులకు  గతంలో సదరం సర్టిఫికెట్ పొంది సర్టిఫికేట్ కాల పరిమితి దాటిన వారితో పాటు కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *