ఈనెల 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు విజయవంతం చేయాలి

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11 :ఈనెల 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే విజయభేరి సభను కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు, అభిమానులు పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కందుకూరు మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి పిలుపునిచ్చారు.సోమవారం ఆయన విజయభేరి సభ ప్రాంగణం రాష్ట్ర నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయభేరి సభకు సోనియా గాంధీ విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయభేరి సభకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన రాష్ట్ర నలుమూలల నుండి కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం పలు రకాలుగా సభకు అనుమతులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా సోనియా గాంధీ విజయభేరి సభను ఆపలేరని ఆయన తెలిపారు.తెలంగాణ కోసం ఉద్యమాలకు ఊపిరిగా ఉన్న ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను తీసుకువస్తే కెసిఆర్ వారి కుటుంబానికి మాత్రమే ఉద్యోగ జీతభత్యాలు అందిస్తున్నారని ఆయన ఆరోపించారు.తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తెచ్చింది ఉద్యమకారులని ఆయన తెలిపారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గ్రహించిన కేసీఆర్ భయంతో విజయభేరి సభకు అనుమతులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రహించి ఉద్యమకారుల అండతో తుక్కుగూడ విజయభేరి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *