ఈనెల 16న నటన డైరెక్షన్ పై ‘వర్క్ షాప్’సినీ దర్శకుడు గీత కృష్ణ వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రముఖ సినీ దర్శకులు, గీత కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్ చైర్మన్ గీత కృష్ణ దిశా నిర్దేశంలో నటన, డైరెక్షన్ పై ‘వర్క్ షాప్’ నిర్వహించనున్నట్లు సినీ దర్శకుడు గీత కృష్ణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలామంది ఔత్సాహిక యువత అభ్యర్ధన మేరకు నటన, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ తదితర రంగాల్లో యువతను తీర్చి దిద్దేందుకు అతి తక్కువ ఫీజుతో ఈ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. గత నెల రోజులుగా రవీంద్ర భారతిలో నడుస్తున్న ‘గీత కృష్ణ సిల్వర్ స్క్రీన్స్ ఫిల్మ్ వర్క్ షాప్’ బుధవారంతో ముగుస్తోందని చెప్పారు. వర్క్ షాప్ లో అద్భుత శిక్షణ అందుకున్నట్లు పాల్గొన్న విద్యార్థులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *