హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 5 : నగరంలోని జవహర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మల్కారం చెరువులో ఈతకెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సాయంతో చెరువులో నుంచి మృతదేహాలను వెలికితీయించారు. మృతులు అంబర్‌పేట్ వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




