ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన జగదేవపూర్ మున్నూరు కాపు నాయకులు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మున్నూరు కాపు మండల అధ్యక్షుడు కొట్టాల మల్లేష్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు ఒక సైనుకుల పని చేయాలనీ అన్నారు. గజ్వెల్ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమే అని అన్నారు. ప్రతి కార్యకర్తలు కష్ట పడి పని చేయాలనీ, ప్రజాస్వామ్యన్ని కాపాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు గుర్రం శ్రీధర్ ములుగు మండల మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గార్నపల్లి కృష్ణమూర్తి బీజేవైఎం జనరల్ సెక్రెటరీ తిగుల యాదగిరి ఉపాధ్యక్షులు నర్ర రాజ్ కుమార్ శ్రీకాంత్ గౌడ్ కర్ణాకర్ రెడ్డి చందస్వామి బిజెపి జనరల్ సెక్రెటరీ కిసాన్ మోచ బత్తుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *