- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వి డి2 రాకెట్
- ప్రయోగం విజయవంతం అయినట్లు ప్రకటన
బెంగళూరు, ఫిబ్రవరి 10 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 9.18 నిమిషాలకు ఎస్‌ఎస్‌ఎల్‌వి డి2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 6.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం.. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వి డి2 రాకెట్ ప్రయోగించబడింది. 2022 ఆగస్టు 7న ఇస్రో ప్రయోగాత్మకంగా నిర్మించి ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వి డి1 రాకెట్ సాంకేతిక కారణాలతో విఫలమైంది. ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టలేకపోయింది. తాజాగా లోపాల్ని సరిదిద్ది ఎస్‌ఎస్‌ఎల్‌వి డి2 రాకెట్ రూపొందించి ప్రయోగిం చారు. డి2 రాకెట్ మొత్తం పొడవు 34 టర్లు, వెడల్పు2 టర్లు, బరువు 119 టన్నులు.
450 కిలో టర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో 156.3 కిలోల బరువున్న ఈవోఎస్-07, 8.7 కిలోల బరువున్న ఆజాదీ శాట్ 02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువున్న జానుస్-01 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపారు. ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించిన దేశంగా ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్ లో భారత్ దూసుకుపోనుంది. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశాలుకు సంబంధించిన చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సాధించింది.



