ఇళ్లు లేని పేదలకు స్వంత ఇంటి కల సహకారం చేస్తున్న

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ఇళ్లు లేని పేదలకు స్వంత ఇంటి కల సాహకారం చెయడానికి గృహ లక్ష్మి పథకం కింద 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత సి ఎం కె సి ఆర్ కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.మహేశ్వరం నియోజకవర్గము తుక్కుగూడ పురపాలక సంఘం పరిధిలోని 2,3,4,5 వార్డులలో 9 కోట్ల 31 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం సాయంత్రం శంకుస్థాపనలు చేసిన  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గార్ల సహకారంతో మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు కార్పొరేషన్లు,రెండు మునిసిపాలిటీలలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.నియోజకవర్గంలోని బడoగ్ పేట్,మీర్ పేట్ కార్పొరేషన్ల,జల్ పల్లి,తుక్కుగూడ మునిసిపాలిటీల పరిధిలోని 11 చెరువుల్లో సుమారు 47 కోట్లతో సుందరికరణ పనులు జరుగుతున్నాయన్నారు.పట్టణ ప్రగతిలో భాగంగా మునిసిపాలిటీలో సకల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.ఇప్పటికే కోట్లాది రూపాయలతో మునిసిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా,ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్  నియోజకవర్గ పర్యటనలో ప్రకటించిన 25 కోట్లతో ప్రజల కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు.రాష్ట్రంలో ఆయా కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించినట్లు,అదే స్ఫూర్తితో మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా
ఇళ్ళు లేని పేదలకు స్వంత ఇంటి కల సాహకారం చెయడానికి గృహ లక్ష్మి పథకం కింద 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత సి ఎం కె సి ఆర్ కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.దాంతో పాటు అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు.గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు ఇంటి జాగా కూడా  అని మంత్రి పేర్కొన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు ,బి ఆర్ ఎస్ నాయకులు,అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *