ఇమామ్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : ఇటీవల హర్యానాలో వి.హెచ్.పి ర్యాలీలో గురుగ్రామ్ మసీదును దహనం చేసి అందులో ఉన్న ఇమామ్ మౌలానా సాద్ ను హత్య చేశాసిన ఘటనలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు సనాఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. హర్యానాలో ముస్లింలపై జరిగిన దాడులకు నిరసనగా ఈ శుక్రవారం అన్ని మసీదుల వద్ద నల్ల జెండాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 2014 నుంచి ముఖ్యంగా మైనార్టీలు క్రిస్టియన్లు ముస్లింలు దళితులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. కొంతమందిని తమ దేశస్తులు కాదని ఆరోపిస్తూ దాడులకు పాల్పడడం ఇంతవరకు సబమని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని హిందూ దేశంగా మారుస్తామని కొందరు ఈ హింసకు పురిగొల్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యులర్ దేశంలో ఇలాంటి దాడులు జరగడం హేయమైనా చర్యగా ఆయన అభివర్ణించారు. ముందు ముందు ఇలాగే అల్లర్లు జరిగితే మన దేశాన్ని ప్రపంచ దేశాలు అసహ్యించుకునే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు ఎంఎ.అజిజ్, అబిబ్, ఎండీ.అబ్దుల్, తన్విర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *