ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్ సోమవారం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పట్నం ప్రజలకు సేవ చేసేందుకు గాను పేద,బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం,ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యాక నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని,కార్మిక,కర్షక వర్గాలు సైతం వర్ణనాతీతంగా బ్రతుకులు ఈడుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తనకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని తాను దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనకే ఇబ్రహీంపట్నం టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నానని ఆయన పేర్కొన్నారు.ఆయన వెంట పట్నం నేతలు త్యాలపల్లి కృష్ణ తదితరులు ఉన్నారు.


