ఇబ్రహీంపట్నంలో జోరందుకున్న కాంగ్రెస్ పార్టీ

ఇబ్రహీంపట్నంలో జోరందుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి కిషన్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 23 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెరుకూరి కిషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొనసాగించారు.ఈ సందర్భంగా చెరుకూరి కిషన్ మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నంలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ప్రజలను గాలికి వదిలేసి తన  స్వలాభం కొరకు అక్రమ భూదందాలు చేసి వేలకోట్లు సంపాదించుకున్నారని ఆయన ఆరోపించారు.ఇబ్రహీంపట్నం మున్సిపాలిలో ఎక్కడ చూసినా గుంతల మయంగా రోడ్లు ఉన్నాయని,స్థానికంగా ఉన్నటువంటి యువత ఉన్నత చదువులు చదివి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగులుగామిగిలిపోయారని ,కేసీఆర్ ప్రభుత్వం ఒక ఉద్యోగ ప్రకటన కూడ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి ప్రజల యొక్క సంక్షేమం కోసం పోరాడుతుందని అన్నారు.ఇందిరమ్మ రాజ్యం రావాలని,మల్రెడ్డి రంగారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలునిచ్చారు.ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపిటిసి సుశీల,ఇబ్రహిం,కిష్టయ్య, సదానంద్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *