మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : ఇందన పొదుపులో 2022-23 సంవత్సరానికి మహేశ్వరం అర్జీసీ డిపోకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి దక్కింది.ఈసందర్భంగా బుధవారం నగరంలోని
విశ్వేశ్వరయ్య భవన్ లో ఇంధన పొదుపు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మహేశ్వరం ఆర్టీసీ డిపోకు రాష్ట్ర స్థాయి మొదటి బహుమతిలో భాగంగా బంగారు పతకాన్ని ఇండియన్
ఫారీస్ సర్వీస్ కార్యదర్శి చంద్రన్మిత్ర నుంచి డిపో మేనేజర్ ఎం.మోహన్రెడ్డి అందుకున్నారు. నేషనల్ ప్రొడక్టవిటి కౌన్సిల్ కార్యదర్శి హేమంత్
రావు ప్రశంసా పత్రాన్ని మెకానికల్ ఫోర్మెన్
ప్రకాష్ కు అందజేశారు. ఈసందర్భంగా డీఎం మెహన్రెడ్డి డిపోలోని కార్మికులందర్శి అభినందించారు. ప్రతి ఒక్క కార్మికుడి కృషి వల్లే బంగారు పతకం సాధ్యమైందని అన్నారు. ఇంధన వనరులను
పొదుపుగా వాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు.



