ఇంద్రేశం అభివృద్ధికి జివిఆర్ ఎంటర్ప్రైజెస్ చేయూత

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 6: పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సహకారంతో 3 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి,  గ్రామ సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ శివకుమార్ గౌడ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సుభాష్, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *