ఇండియా కూటమిని చూస్తే మోదీకి వణుకు పుడుతుంది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: ఇండియా కూటమిని చూస్తే ప్రధానమంత్రి మోదీకి వణుకు పుడుతుందని టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల పట్ల మోదీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు అన్ని పార్టీల తో కూటమిగా ఇండియా ఏర్పడిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని సంకేతాలు రావడంతోనే ఒకే దేశం ఒకేసారి ఎన్నికల పేరిట జమిలి అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు నిర్వహించలేదని అన్నారు. జమిలి ఎన్నికల కమిటీలో బిజెపికి చెందిన అనుకూలమైన వారికే చోటు ఇచ్చారని ఇతర పార్టీలను ఆహ్వానించలేదని అన్నారు. అలాంటి ఎన్నికలు రావడం కష్టమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దేశ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని బంగారు తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని నిరూపిస్తామని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న దృష్ట్యా నాయకులు కార్యకర్తలు సమాయత్తం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ నంగునూరు మండల అధ్యక్షులు తప్పెట శంకర్, రమేష్, గయాజుద్దీన్, గ్యాదర్ మధు, రాశద్, రఘుపతి, నవాజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *