తాండూరు, ప్రజాతంత్ర, జూలై 17: ఇంటి పైకప్పు కూలి ఓ మహిళ ఇద్దరు పిల్లలకు గాయాలు అయిన సంఘటన సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం పాత తాండూర్ రైల్వే గేట్ సమీపంలో అంబేద్కర్ నగర్ లో నీరటి నరసింహులు అనే వ్యక్తి కి చెందిన మాల బండ ఉన్న ఇంట్లో అద్దె కు గత కొన్ని సంవత్సరాలుగా నరసమ్మ అనే మహిళ ఆమె పిల్లలు నందిని, మనోహర్, నిరంజన్, దినేష్ లతో కలసి నివాసం ఉంటున్నారు. చాలా రోజులుగా వారు ఉంటున్న ఇల్లు ఓవైపు కృంగిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి మధ్యాహ్నం ఇంటి పైకప్పు కృంగిపోయి దూలం విరిగి పోయింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నర్సమ్మ కాళ్లపై పడిపోయింది. ఇంట్లో ఉన్న ఇద్దరి పిల్లలు తలకు, చేతులకు , విపు భాగం లో మూగ దెబ్బలు తగిలాయి. వీరిని కూడా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ శోభారాణి కుటుంబ సభ్యులను పరామర్శించరు. వర్షాకాలం లో శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ఉండకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు పోలీసులు సూచిస్తున్నారు.



