ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్  ఏర్పాటు -సమీకృత కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 29: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30న పోలింగ్ సందర్భంగా  అన్ని రకాల పూర్తిస్థాయి పర్యవేక్షణకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల సమీకృత కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి, ప్రతిక్షణం అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సెక్టోరల్ అధికారులు, ఈవీఎం వాహనాల జిపిఎస్ ట్రా కింగ్, మీడియా మానిటరింగ్, వెబ్ క్యాస్టింగ్ మానిటరింగ్, సి విజిల్  మానిటరింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కంట్రోల్ రూమ్  ద్వారా 24 గంటలు నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కంట్రోల్ రూమ్ లో ఆయా పర్యవేక్షణకై పూర్తిస్థాయిలో సిబ్బంది ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటూ, అత్యంత సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ కొనసాగు టుందన్నారు.కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ సిబ్బంది మీ ఆయా అంశాలపై, పనితీరుపై ఆరా తీసి ,పలు సూచనలు చేశారు.లెక్టర్ వెంట డి ఆర్ ఓ నగేష్,తదితరులు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *