ఇద్దరిని అరెస్ట్ చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : నూతన సంవత్సరం సందర్భంగా డ్రగ్స్ సరఫరాపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌ను గుర్తించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ వి•డియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో ఒక నైజీరియన్‌ను అరెస్ట్ చేశామని, మణికొండకు చెందిన సేలం సాయి కృష్ణ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని.. వారి వద్ద నుంచి 30 గ్రాముల మేటఫెట మైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో పట్టుబడ్డ నైజీరియన్‌కు నేర చరిత్ర ఉందని, పూణెళిలో డ్రగ్స్ కేసులో అరెస్టయి జైల్లో కూడా ఉన్నాడన్నారు. స్టూడెంట్ వీసాపై వచ్చిన నైజీరియన్ వీసా సమయం అయిపోయినా కూడా ఇక్కడే ఉంటున్నాడని, ముంబై పూణెళిలలో ఉంటూ డ్రగ్ సేకరించి సరఫరా చేస్తున్నాడన్నారు.
మణికొండకు చెందిన సేలం సాయి కృష్ణ డ్రగ్స్‌కు అడిక్ట్ అయ్యాడని, ముంబైలో ఉంటున్న నైజీరియన్‌కు డ్రగ్స్ ఆర్డర్ చేశాడని, ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చిన నైజీరియన్‌ను, సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ముంబైలో మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడని, అతని అదుపులోకి తీసుకోవడానికి టీమ్స్‌ను ముంబైకు పంపిస్తున్నామని చెప్పారు. నైజీరియన్‌పై పాస్‌పోర్ట్ యాక్ట్, నార్కోటిక్ క్యాట్ కింద కేసులు నమోదు చేశామన్నారు.
మరో కేసులో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి 45 గ్రాముల హెరాయిన్, రూ.35 లక్షల విలువైన వస్తువులు సీజ్ చేసినట్లు చెప్పారు. పట్టుబడ్డ నిందితులంతా రాజస్థాన్‌కు చెందిన వారన్నారు. ఈ కేసులో మహాదేవ అనే వ్యక్తి ట్రాక్ సప్లయర్‌గా ఉన్నాడని, అతనిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు.



