ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 7 : మంచాల మండల కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న ఆశ వర్కర్ల నిరవధిక సమ్మె 13 వ రోజు చేరింది.ఈసందర్భంగా .రిలే నిరహార దీక్షలు చేపట్టారు.సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ,
ఆశావర్కర్లకు18 వెల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.టిబి, స్కూటమ్ డబ్బాలను ఆశాలతో మోపించకూడదని,టిబి,లెప్రసీ,కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని అన్నారు.2021 జులై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియార్స్ వెంటనే చెల్లించాలని అన్నారు. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు 1000 చొప్పున 16 నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలని,32 రకాల రిజిస్టర్ ప్రభుత్వం ప్రింట్ చేసి సప్లై చేయాలని,ప్రసూతి సెలవుల పైన సర్కులర్ వెంటనే జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.                    ఈ కార్యక్రమంలో ఆశవర్కర్లు అమృత, మంజుల,రజిత,కవిత,అమృత,అలివేలు, సంతోష,స్వరూప,పద్మ ,శ్యామల,సుజాత
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *