ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 25 : ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్ర రాఘవేందర్ అన్నారు. కడ్తాల్ మండలంలో సోమవారం ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు రాఘవేందర్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్ల 16 న్యాయమైన డిమాండ్లను వారి హక్కులను ప్రభుత్వం గుర్తించి నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా నాయకులు కురుమయ్య, వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సిలివేరు మాధవులు, కడ్తాల్ మండల కురుమ యువ చైతన్య సంఘం అధ్యక్షుడు నార్లకంటి లక్ష్మీ నారాయణ, యువజన సంఘం సభ్యులు క్యామ మహేష్, కేషని బాల కృష్ణ, పోతగళ్ల మురళీ, ఓర్సు మహేష్, ఆశ వర్కర్లు జ్యోతి, శారద, తిరుపతమ్మ, లావణ్య, సరిత, సరోజిని, పద్మ, అనిత, రజిత, తదితరులు పాల్గొన్నారు.




