ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17:  ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ మీర్పేట్ హెచ్ బీ కాలనీ లో గడపగడపకు తిరుగుతూ  కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని  బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  కోరారు.  బస్తీ మహిళలు  అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి కుంకుమతో విజయ తిలకం దిద్ది హారతిలతో  స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్పేట్ హెచ్ బీ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్, లక్ష్మీ నగర్, చైతన్యనగర్, ఫేజ్-2 ఇంద్రనగర్ కాలనీలలో సంక్షేమ పథకాలు వివరిస్తూ గడప గడప ప్రచారం చేశారు . ఈ సందర్భంగా బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  రైతులకు, వృద్ధులకు, మహిళలకు, యువతి యువకులకుతెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ పథకంలో భాగంగా విడతల వారీగా డివిజన్ కు సుమారుగా 267 ఇళ్ల పంపిణీ లబ్ధిదారులకు అందాయని గుర్తు చేశారు. బస్తీ దావాఖనలో ఉచిత మందులు, అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులకు పౌష్టికాహారం, పాఠశాలలోని విద్యార్థులకు అల్పాహారం, ఆసరా పించన్ ఇలా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయని, అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా అస్త్రాలుగా ముందుకు వెళ్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్, న్యూట్రిషన్ కిట్ లాంటి పథకాలు అందుతున్నాయని   అన్నారు. ఈ  కార్యక్రమంలో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ , మాజీ కార్పొరేటర్ లు గుండారపు శ్రీనివాస్ రెడ్డి  ,  గోళ్లూరి అంజయ్య, స్థానిక యువకులు, బీఆర్ఎస్ డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *