ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: పటాన్ చెరు నియోజకవర్గంలో కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అన్ని మతాల ప్రార్థన స్థలాల నిర్మాణాలకు, అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించతలబెట్టిన మల్లన్న స్వామి దేవాలయం, బీరప్ప స్వామి దేవాలయం భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆలయాల నిర్మాణాలకు మొదటి విడతగా 10 లక్షల రూపాయల విరాళం అందించారు. ఆలయాల పూర్తి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు సొంత నిధులతో 180 కి పైగా దేవాలయాలు, 100కు పైగా మసీదులు, చర్చలు నిర్మించామని తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు భగవంతుడి ఆరాధన చేయాలని కోరారు.ఒగ్గు కళాకారులు, డప్పు వాయిద్యాలు, బోనాలతో జిఎంఆర్ కు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, చిన్నకంజర్ల సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ హరిశంకర్ గౌడ్, గోపాల్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *