ఆర్ధిక వృద్ధిరేటును ప్ర‌క‌ టించిన వెరానియం క్లౌడ్‌ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ కంపెనీ ఐన వెరానియం క్లౌడ్ లిమిటెడ్ త‌న వ్యాపార కార్య‌క‌లాపాల్లో అసాధార‌ణ ఆర్ధిక వృద్ధిని సాధించిందని ఆ సంస్థ ప్రతినిధులు గురువారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం ఆదాయం, నిక‌ర లాభాల‌లోనూ గ‌ణ‌నీయ‌మైన వృద్ధి న‌మోదైనట్లు వారు పేర్కొన్నారు. సెప్టెంబర్ తో ముగిసిన 2024 ఆర్థిక సంవ‌త్స‌రం తొలి అర్ధ సంవ‌త్స‌రంలో(హెచ్‌1) రూ.96.25 కోట్ల స్టాండ‌లోన్ నిక‌ర లాభం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి అమెరికా, యూఏఈల‌లో అనుబంధ కంపెనీలను తెరవడానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా వినాయక్ వసంత్ జాదవ్ నియమితులైనట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *