జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన కాసాని పాపన్న(50) అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం మృతుని కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు పరామర్శించి రూ.5000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ నాయకులు ప్రసాద్, మరాటి వెంకటస్వామి మాట్లాడుతూ… గ్రామంలో నిరుపేద కుటుంబ సభ్యులు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ తరుపున ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మచ్చేందర్ రెడ్డి, లింగప్ప, మామిండ్ల కిషన్ యాదవ్, యాదగిరి చారి, గుర్రం వేద, సత్తయ్య, వడ్లకొండ శ్రీనివాస్, ముచపతి జగదీశ్, గోపాల్ రెడ్డి, దొమాట భాను, పొన్నాల కార్తీక్, సామల భాస్కర్, విశ్వనాథం ఉన్నారు.




