ఆర్థిక ప్రగతిపై బీఆర్‌ఎస్‌ ఆస్తుల జాబితా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వంప్రయత్నానికి చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో కేసీఆర్‌ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడిరచింది. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడానికి ముందే.. బీఆర్‌ఎస్‌ ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ప్రచారం నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

తర్వాత కూడా పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈ నెల 8న మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, ఆర్థిక రంగ నిపుణులు, పలువురు ప్రస్తుత, రిటైర్డ్‌ ప్రొఫెసర్లతో కూడిన సభ్యుల బృందం కొన్ని రోజులుగా తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వ్యయాలు, నిధుల సమీకరణ, కేటాయింపు తదితర అంశాలపై లోతుగా విశ్లేషిచడానికి..ముఖ్యంగా రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారెంటీల లెక్కలను ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. దీంతోపాటు శాఖల వారీగా సమగ్ర వివరాల నివేదికలు వారి వద్దకు చేరాయి. అనంతరం..ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *