ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 9 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా శనివారం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమనగల్ బస్టాండ్ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళలు కల్వకుర్తి, అచ్చంపేట, మహేశ్వరం డిపోలకు చెందిన బస్సులలో ఉచితంగా ప్రయాణించారు. అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమనగల్లు బస్టాండ్ లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వివరాలను మహిళలకు అవగాహన కల్పించారు.
ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం





