ఆర్టీసిని కూడా అమ్మేయాలని బెదిరింపులు

మేం అమ్ముతున్నాం..వి•రూ అమ్మండనే విధానం
కేంద్రం విధానాలపై సిఎం కెసిఆర్‌ ‌ఫైర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తుందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. సంస్కరణల పేరుతో అన్ని ఆస్తులను తెగనమ్ముతునన మోడీ రాష్ట్రాలపైనా పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ ‌సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేంద్రం విధానాలపై ధ్వజమెత్తారు. ‘మీటర్‌ ‌పెట్టకుండా విద్యుత్‌ ‌కనెన్షన్‌ ఇవ్వొద్దని కేంద్రం తీసుకువచ్చిన గెజిట్‌లోనే ఉన్నది. గెజిట్‌ ‌నిన్నగాక మొన్న వొచ్చింది. చట్టంలో లేదు..మేము అనలేదు అంటున్నరు. ఆంధప్రదేశ్‌ శ్రీ‌కాకుళంలో మీటర్‌ ‌పెడితే రైతులంతా కుప్పలు పోసి..ధర్నా చేశారు. ఈ ప్రమాదం తెలంగాణకు వొస్తే సర్వనాశనం అవుతుందని అక్కడికి వెళ్లి వాస్తవాలు తెలుసుకున్నం. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తియ్యని మాటలు చెప్పారు. ఫ్రీ కరెంటు ఇస్తామన్నరు. అక్కడ వి•టర్లు పెడితే మూడు నాలుగు జిల్లాల్లో రైతులంతా కరెంటు ఆఫీసుకాడ మీటర్లు పోసి..పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి..ఇంకా జరుగుతున్నయ్‌’ అని గుర్తు చేశారు.

మిత్రుడు రఘునందన్‌రావు మా బీజేపీ పార్టీ మీటర్లు పెట్టదని అంటున్నాడని..పెట్టేది కేంద్ర ప్రభుత్వం కదా?..మీ పార్టీకి..ప్రభుత్వానికి ఏమైనా గ్యాప్‌ ఉం‌దా? మీలోనే మీపైనే అపనమ్మకం ఉందా? మీరు చెప్పేది తప్పా? వాళ్లు చెప్పేది తప్పా? వాస్తవాలు ఇలా ఉన్నాయి. వొచ్చిన గెజిట్‌ ఇది మరి అంటూ మండిపడ్డారు.  ఒక్క అగ్రికల్చర్‌ ‌కనెక్షన్‌ ‌కాదు.. ‘ఏ రకమైనా కనెక్షన్‌ అయినా భారతదేశంలో వి•టర్‌ ‌లేందే ఇవ్వడానికి లేదు’ అని శాసించి, దీనికి వ్యతిరేకంగా పోతే ముమ్మల్ని తొక్కి సంపుతం అనే పద్ధతిలో మాట్లాడుతున్నరు. ఇది ఎట్ల రఘునందన్‌ ‌రావు సమర్థిస్తరో.. విద్యుత్‌ ‌సంస్కరణల పేరుతో దానికి అందమైన ముసుగు. ఇది సంస్కరణలు కాదు.. పాడు కాదు. పేద ప్రజలను, కరెంటు వాడే ప్రతి ఒక్కరినీ దోచుకునే ఒక దుర్మార్గపు చర్య అని అంటూ కెసిఆర్‌ ‌మండిపడ్డారు. సంస్కరణ అనే అందమైన ముసుగు తొడుగు. ఇదే శాసన సభలో ఇంతకు ముందు చర్చించాం. ఈ సంస్కరణలు అమలు చేసిన వారికి పాయింట్‌ 5‌శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అదనంగా ఇస్తామని చెప్పారు. ఇది అన్యాయమని చెప్పాను.

పటిష్టమైన రాష్ట్రాలకు వేరే ఇవ్వాల్సినవి ఇవ్వకుండా.. మీరు అమ్మేయండి అని ఈ కేంద్రం వెయ్యి కోట్లు బహుమతి పెట్టారు. ఆర్టీసీని అమ్మేయండి అని లెటర్లు మీద లెటర్లు వొస్తున్నయ్‌. ఎవరు ముందుగ అమ్మితే వారికి వెయ్యి కోట్ల బహుమానం అంటున్నరు. మొత్తం మీద మేం కూడా అమ్ముతున్నం కాబట్టి..మీరు కూడా అమ్మేయండి అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నరంటూ సీఎం కేసీఆర్‌ ‌మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇంధన ఖర్చులు తగ్గించుకొని ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని సీఎం అన్నారు. కేంద్రం అన్నింటినీ అమ్మేస్తుందని, వ్యవసాయం, విద్యుత్‌ ‌మాత్రమే మిగిలాయని ధ్వజమెత్తారు. ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం మాయ మాటలు చెబుతుందన్నారు. రైతులు వ్యవసాయం చేయలేమంటే.. కార్పొరేట్‌ ‌కంపెనీలను రంగంలోకి దించాలని కేంద్రం ఆలోచిస్తుందని దుయ్యబట్టారు. కేంద్రం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తుందని, కేంద్రం తీరుతో ఆహార భద్రత ప్రమాదంలో పడిందని కేసీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు. ధాన్యం కొనాలని అడిగితే కేంద్రమంత్రి అవహేళన చేశారని సీఎం కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *