ఆరు బయట అటు ఇటు చెత్తను పడేయకు పడేయనివ్వకు

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: పురపాలక సంఘం కార్యాలయం లో కమిషనర్ సంపత్ కుమార్ మున్సిపల్ లో విధులు నిర్వహిస్తున్న అన్ని విభాగాల సిబ్బందికి ఆరు బయట అటు ఇటు చెత్తను పడేయకు, పడేయనివ్వకు (ఫెకొ మత్) పై అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. మనం బయట తిరుగుతున్న సమయం లో ఎవరో ఒకరు చెత్తను,బిస్కెట్ ప్యాకెట్,కుర్ కురి,చాక్లెట్ కవర్ లను బయట వేస్తుంటారని అలా బహిరంగ ప్రదేశాలలో చెత్త వెస్తున్నవారిని వెంటనే ఆపి చెత్త బయట వేయకూడదని అవగాహన కల్పించాలని తెలిపారు. ఒకవేళ  ఎవరైనా మీ ముందు బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేస్తా మీరు ఏం చేస్తారో చూపించాలని వారిచే నాటక దృశ్యం ప్రదర్శింప చేశారు. స్వచ్ఛ సిద్దిపేట కొరకై  మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఎంతో కృషి చేస్తున్నారని వారి ఆదేశాలమేరకు ప్రతి రోజూ ఉదయం కౌన్సిల్ సభ్యులు వార్డులలో సైతం నడుస్తూ చెత్త ఏరుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని మనమంతా స్వచ్ఛ సైనికులమని మనమంతా చెత్త వేయకుండా ఉండటమే కాదు ఇతరులను సైతం చెత్త వేయనివ్వకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. ఇప్పటికే పట్టణమంతా చాలా వరకు మార్పు వచ్చిందని ప్రజలలో మరింత మార్పు తేవటానికి అవగాహన కల్పించటానికి ఈ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరూ ఇంట్లో వెలువడే చెత్తను తడి,పొడి,హానికర చెత్తగా వేరు చేసి ఉదయం వచ్చే మున్సిపల్ చెత్త వాహనానికి , దుకాణదారులు  కమర్షియల్ వాహనాలకు ఇస్తున్నారని ఎవరో కొంత మంది అవగాహన లేక బహిరంగ ప్రదేశాలలో వేస్తున్నారని అలాంటి వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మల్లికార్జున్ ఏఎంసీ,మేధ(హైదారాబాద్ సుధీర్ పులోమియ,స్వచ్ఛ భారత్ కన్సల్టెంట్, కో ఆర్డినేటర్ (ఇండోర్) అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *