ఆరు పథకాలు ఆరు అస్త్రాలు కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని, ఆరు పథకాలు.. ఆరు అస్త్రాలుగా మార్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం చంపాపేట్ లో ఐఓసి నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి మధుయాష్కీ గౌడ్ పాదయాత్ర చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను వివరించి 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు. దారి పొడవునా పాదాచారులతో కరచాలనం చేస్తూ, ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని  ఎల్బినగర్ లో తనను ఆశిర్వదించి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గం ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, డివిజనల్ ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *