ఆరు నూరైనా మల్లారెడ్డి గెలుపును ఆపలేరు రాహుల్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  03 : ఆరు నూరైనా  బిఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని  ఆ పార్టీ నాగారం మున్సిపల్ యువజన నాయకుడు  కౌకుంట్ల  రాహుల్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని  గెలిపించాలని  బిఆర్ఎస్ నాయకులతో కలిసి  మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు  సత్యనారాయణ కాలనీలో  విస్తృతంగా   ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి మల్లారెడ్డిని   భారీ  మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా  కేసీఆర్, రెండోసారి ఎమ్మెల్యేగా  మల్లారెడ్డి విజయం ఖాయమని  అన్నారు.  ప్రచారంలో ప్రజల నుంచి   విశేష  స్పందన లభిస్తుందని  తెలిపారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేసే కాంగ్రెస్  నాయకులను  ప్రజలు నమ్మరని తెలిపారు. బిఆర్ఎస్ తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని  ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  నాగారం మున్సిపాలిటీ  బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు  వెంపల్ల నరేందర్ రెడ్డి, వార్డ్ అధ్యక్షుడు నాగరాజు. ప్రధాన కార్యదర్శి  రాజశేఖర్, త్యాగరాజు   బిఆర్ఎస్ పార్టీ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *